KKD: కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ బుధవారం సాయంత్రం 47వ డివిజన్ సచివాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, విధులకు ఎంత మంది వచ్చారో స్వయంగా సరిచూశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.