HYDలో ఆటో LPG కొరతపై అత్యవసర సమీక్ష జరిగింది. సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రైవేట్ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు. సరఫరా తగ్గితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాశ్చాత్యదేశంలో యుద్ధ పరిస్థితుల వల్ల సరఫరా 35% వరకు తగ్గినప్పటికీ, వెంటనే దిగుమతులు పెంచాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.