అంతరిక్ష ప్రయోగంలో మరో చారిత్రాత్మక ఘట్టం జరిగింది. నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 ప్రయోగం విజయవంతం అయింది. 53 ఏళ్ల తర్వాత చంద్రుడి దగ్గరకు నాసా మనుషులను పంపుతోంది. ఈ మిషన్ ద్వారా చంద్రుడి యాత్రకు నలుగురు వ్యోమగాములు వెళ్లారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పెస్ సెంటర్ నుంచి ప్రయోగం చేశారు. చంద్రుడికి 10,300 కి.మీ సమీపం వరకు వెళ్లి 10 రోజుల పాటు వ్యోమనౌక అంతరిక్షంలో ప్రయాణించనుంది.