కృష్ణా: కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామంలో నిర్మించనున్న వాటర్ ట్యాంక్, అంగన్వాడీ గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీ 4 కార్యక్రమంలో భాగంగా దాతలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.