VZM: ఈ నెల 27న పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శిరీష బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోడ పత్రికలను విడుదలచేస్తూ.. ఆరోజు ఉదయం అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తామని, సాయంత్రం 4 గంటలకు వనం గుడి నుంచి గంట స్తంభం మీదుగా హుకుం పేట చేరుకుంటుందన్నారు. 28న మూడు లాంతర్లు వద్ద గుడికి చేరుకుంటుందని తెలియజేశారు.