డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన ఇవాళ, రేపు పాండిచ్చేరిలో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. అనంతరం ఏప్రిల్ 4న కేరళలోని పతనంతిట్ట నియోజకవర్గంలో ఎన్నికల సభల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం ఆయన విస్తృతంగా పర్యటిస్తూ.. క్యాడర్లో జోష్ నింపుతున్నారు.