KDP: వల్లూరు(M) ఏ. ఓబయపల్లె క్రాస్ వద్ద జరిగిన కే. వెంకటసుబ్బయ్య హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. CI మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్, మోహన్ రంగ, రఘురాం కలిసి కత్తులతో దాడి చేసి హత్య చేసినట్టు విచారణలో తేలింది. మృతుడికి, నిందితుల మధ్య పాత కక్షలే ఈ ఘటనకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు.