కర్నూలు జిల్లా కోయనగర్ కాలనీలో యూకేజీ విద్యార్థి ప్రవీణ్‌ను ట్యూటర్ రజిని విచక్షణారహితంగా చితకబాదారని తల్లిదండ్రులు ఎల్లప్ప, ఈరమ్మ తెలిపారు. మంగళవారం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రవీణ్‌ను ట్యూషన్‌కు పంపామన్నారు. ట్యూటర్ పుస్తకంలో పెన్సిల్‌తో రాశాడని, అది చెరిపే క్రమంలో చిరిగిపోయిందని, దాంతో ఆమె తీవ్రంగా కొట్టిందని తల్లిదండ్రులు వెల్లడించారు.