ATP: జిల్లాలో వెట్టి చాకిరిని పూర్తిగా రూపం మాపాలని, ఎక్కడైనా ఇలాంటి కేసులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. అనంతరం వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన చట్టం 1976పై సామర్థ్యత పెంపుదలపై సదస్సు నిర్వహించారు.