ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు కొత్తూరు బీసీ కాలనీలో కొత్తగా నిర్మించిన డ్రైనేజ్ పనులను టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ పనుల నాణ్యతను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని సంబంధిత వారికి సూచించారు.