ప్రకాశం: సింగరాయకొండ పాకాల బీచ్‌కు వచ్చే సందర్శకుల భద్రతే తమకు ముఖ్యమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. సోమవారం 30 లైఫ్ జాకెట్లను దాతల సహకారంతో మంత్రి పంపిణీ చేశారు. సముద్ర తీరంలో విపత్తు నిర్వహణ సమయంలో ఈ లైఫ్ జాకెట్లు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. సంబంధిత పోలీసు అధికారులకు మంత్రి లైఫ్ జాకెట్లు అందించారు.