అనంతపురంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి వేమన మాట్లాడుతూ.. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్ఏ జిల్లా ఉపాధ్యక్షుడు భీమేష్, నాయకులు అరవింద్, వంశీ, తదితరులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు.