NDL: బనగానపల్లెలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం నూతనంగా నియమితులైన అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన 20 మంది కార్యకర్తలకు మంత్రి నియామక పత్రాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గర్భిణులు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.