CTR: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సదుం మండలం మొరవమీదపల్లిలో బుధవారం ఆయన పర్యటించారు. పలువురు వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వారు పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పాల్గొన్నారు.