E.G: సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ M. శైలజ రాణి ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియా ప్లాస్మోడియం క్రిమి, ఎనాఫిలిస్ ఆడదోమ ద్వారా వ్యాపిస్తుందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం కలగవచ్చని ఆమె తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.