KRNL: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మంత్రి నారా లోకేష్‌ను ఇవాళ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. పార్టీ పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.