VZM: ఎవరి వద్దనైనా వీల్ చైర్లు నిరుపయోగంగా ఉంటే నిరుపేదలైన రోగులకు అందజేయాలని ఆల్ ఇండియా బాడీ ఆర్గాన్స్ డొనేషన్స్ అసోసియేషన్ ఏపీ జనరల్ సెక్రెటరీ షిణగం శివాజీ సోమవారం కోరారు. విజయనగరానికి చెందిన సైలాడ శ్రీదేవి తన తండ్రి మృతి చెందడంతో ఇంటిలో వృధాగా ఉన్న బాత్రూం స్టాండ్ కలిగి ఉన్న వీల్ చైర్‌ను గరివిడి కొండ శంభాం చెందిన నిరుపేద రోగి రామారావుకు అందజేశారు.