NLR: పేదలకు సొంత ఇంటిని పూర్తి చేసి ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా గృహనిర్మాణశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పని చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. శనివారం గృహనిర్మాణాల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.