Astrologer venu swamy : జగన్ ని మళ్లీ సీఎం చేసేది పవనే… జోతిష్యుడు వేణు స్వామి
Astrologer venu swamy : జగన్ ని మళ్లీ సీఎం చేసేది పవనే... జోతిష్యుడు వేణు స్వామి : జోతిష్యుడు వేణు స్వామి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్య పలువురు సెలబ్రెటీల గురించి జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత ఆయన మరింత ఫేమస్ అయ్యాడు.
జోతిష్యుడు వేణు స్వామి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్య పలువురు సెలబ్రెటీల గురించి జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత ఆయన మరింత ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి కేవలం ఆయన సెలబ్రెటీల గురించి మాత్రమే జాతకాలు చెబుతూ వస్తున్నాడు. తాజాగా ఆయన…. ఏపీలో వచ్చే ఎన్నికలపై కూడా కామెంట్ చేశాడు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేది జగనేనని ఆయన అన్నారు. అంతటితో ఆగకుండా…. పవన్ కళ్యాణ్ కారణంగానే జగన్ .. ముఖ్యమంత్రి కాబోతున్నాడంటూ అంటూ ఆయన బాంబు పేల్చడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తారని అన్నారు వేణుస్వామి. వైసీపీ గెలిచినా.. తెలుగుదేశం పార్టీ ఓడినా.. లేదంటే రివర్స్ అయినా అది పవన్ కళ్యాణ్ వల్లే కానీ.. అతను గెలవడానికి మాత్రం కాదన్నారు. వేరే వాళ్లని సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ ఉన్నదని వేణు స్వామి అన్నారు. అయితే పవన్ కళ్యాణ్-జనసేన కలిసి పోటీ చేసి.. పవన్ కళ్యాణ్‌ని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే మాత్రం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని అన్నారు. అయితే చంద్రబాబు తాను కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం అంటే అంతకు మించిన జోక్ ఉండదన్నారు.
2017లో పవన్ సీఎం కాడు అని తాను చెప్పానని.. అప్పుడు పవన్ అభిమానులు తనను బూతులు తిట్టారని గుర్తు చేశారు. కానీ తాను చెప్పిందే జరిగిందన్నారు. పవన్ సీఎం కారని… జగన్ ని మాత్రం ఆయనే సీఎం చేస్తారంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.