జగిత్యాల జిల్లాలో వేసవి సెలవుల సందర్భంగా పిల్లలు, యువకులు చెరువులు, కాలువల వద్ద ఈతకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈత సరదా విషాదంగా మారకూడదన్నారు. తల్లిదండ్రుల సమక్షంలోనే ఈత నేర్చుకోవాలని తెలిపారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరించారు.