ATP: మహిళలు పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో రాణించడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో 27 మంది గ్రామ సంఘ సహాయకులకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 751 సంఘాలు బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి ద్వారా రూ. 37.84 కోట్ల రుణాలు పొందాయని వెల్లడించారు.