AKP: నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, టీబి యూనిట్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చని తెలిపారు.