ప్రకాశం: పెద్దారవీడు మండలం పెగళ్లపాడు చెంచుగూడెంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, 7 విల్లు, 30 బాణాలు, 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం సీఐ గ్రామ ప్రజలకు సామాజిక దురాచారాలు, గిరిజనుల సమస్యలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.