E.G: నన్నయ యూనివర్సిటీ డీన్ అకడమిక్ అఫైర్స్ ఆధ్వర్యంలో మంగళవారం డిగ్రీ బోర్డు ఆఫ్ స్టడీస్(BOS) సమావేశం నిర్వహించారు. VC ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ హాజరై BOS చైర్మన్లు, సభ్యులకు దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పెంచుతూ అన్ని డిగ్రీ కోర్సుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020, రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలన్నారు.