TPT: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష నిర్వహించి, కేసుల వేగవంత పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. 2024 నుంచి 2026 వరకు ఉన్న కోర్టు డిస్పోజల్ డేటా, NBWs, PRC కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కోర్టు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. సమన్వయంతో పనిచేసి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.