SKLM: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDM A ఎండీ ప్రఖర్ జైన్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో మంగళవారం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడినప్పుడు చెట్లు కింద ఉండరాదని సూచించారు.