ATP: బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవరోజు ఆలూరు గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శేషతల్ప రంగనాథుడిగా కొలువైన స్వామివారి కల్యాణ వేడుకను గురువారం భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు.