SRD: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్సీ అంజి రెడ్డి రామచంద్రాపురంలో ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల, ప్రజా సేవే పరమావధిగా సాగే లక్ష్యాల పట్ల మా నిబద్ధతను మరొక్కసారి చాటుకున్నామన్నారు. దేశాభివృద్ధిలో భాగస్వాములమవుతూ ముందుకు సాగుతామని తెలిపారు.