బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి చెందిన ‘బాస్టియన్’ రెస్టారెంట్ ధరల గురించి ఓ వార్త SMలో హల్చల్ చేస్తోంది. బాస్టియన్‌లో ఫుడ్ తిన్న కొందరు తమ బిల్లును SMలో షేర్ చేయగా అందులోని ధరలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. నలుగురికి కలిపి రూ.21,731 బిల్లు అయినట్లు తెలిపారు. చికెన్ న్యూడిల్స్ ధర రూ.950, ఫ్రెంచ్ ఫ్రైస్ ధర రూ.1450 ఉండటంతో మాటలు రావడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు.