గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఎస్జీటీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీచర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 క్రికెట్ టోర్నమెంట్ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యాబోధనతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమన్నారు. ఇలాంటి పోటీలు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని పేర్కొన్నారు.