AP: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పోలీసుల పహారాలో ఉంది. ఛలో ఆకివీడుకు హిందూ, క్రైస్తవ సంఘాల పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో అక్కడికి అదనపు బలగాలు చేరుకున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొడితే అరెస్టు చేస్తామంటూ డీఎస్పీ రఘువీర్ హెచ్చరించారు. పెద్దపేట ఘటనపై 67 కేసులు నమోదు కాగా, 41 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.