NRML: రేపు బాసర పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు దీనిని గమనించి సహకరించాలని కోరారు. వచ్చే సోమవారం తిరిగి యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని తెలిపారు.