ADB: ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో MP గోడం నగేశ్, MLA పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పీడిత వర్గాల అభ్యున్నతి, కార్మికుల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయని కొనియాడారు.