AKP: కోటవురట్ల మండలంలో చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను వేగవంతం చేయాలని సిబ్బందిని ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం గొట్టివాడ, చౌడువాడ గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేను పర్యవేక్షించారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా సర్వేను నిర్వహించాలన్నారు. సకాలంలో సర్వేను పూర్తి చేయాలన్నారు. నిబంధనల ప్రకారం సర్వే జరగాలన్నారు.