విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ (26) అమెరికాలో ప్రమాదవశాత్తు నదిలో జారిపడి మృతి చెందాడు. శనివారం తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మారమేక్ స్టేట్ పార్క్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పుట్టినరోజునే సాయి శ్రీ హరికృష్ణ మృతి చెందాడన్న వార్త రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.