PPM: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. సీతానగరం మండలం బూర్జ పంచాయతీలో బూర్జ, కృష్ణరాయపురం, అంకలం గ్రామాలకు వెళ్లే రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.