KDP: జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులపై నిఘా పెంచారు. లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించి, ఆధార్ వివరాలు పరిశీలిస్తున్నారు.