AKP: దేవరాపల్లి మండలం గర్సింగి సచివాలయ హెల్త్ సెక్రటరీ రాజ్యలక్ష్మిపై లయంగిక వేధింపులకు పాల్పడిన సూపర్వైజర్ను సస్పెండ్ చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేసాయి. మంగళవారం అనకాపల్లి సీఐటీయూ కార్యాలయంలో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ వేధింపులు కారణంగా సెక్రటరీ ఆత్మహత్య యాత్నానికి పాల్పడిందన్నారు.