GNTR: మేడికొండూరు మండలంలోని విశదల, వెలువర్తి, డోకిపర్రు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా రైతులకు రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రీ–సర్వే ప్రక్రియ ద్వారా నిజమైన హక్కుదారులను గుర్తించి పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.