PLD: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శావల్యాపురం సొసైటీ ఆవరణలో రూ. 40 లక్షలతో జీడీసీసీ బ్యాంక్ భవనాన్ని నిర్మించారు. ఆర్బీఐ అనుమతులు రాకపోవడంతో ఆ భవనం నిరుపయోగంగా మారింది. ఫలితంగా స్థానిక రైతులు నగదు విత్డ్రా కోసం వినుకొండ వరకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడ బ్యాంకు శాఖను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.