ప్రకాశం: అర్ధవీడు మండలంలో ఈసీ బెల్లంకొండ కిషోర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో లేని మొక్కలను ఉన్నట్లుగా చూపించి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం ఈసీ బెల్లంకొండ కిషోర్ కుమార్ను సస్పెండ్ చేస్తూ జిల్లా పీడీ జోసెఫ్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మార్కాపురంలో విధులు నిర్వహిస్తున్న ఆయనపై విచారణ కొనసాగుతోంది.