ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభించారు. అంకురార్పణ, రక్షా బంధనం కార్యక్రమంతో వేడుకలను ప్రారంభించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, పురోహితులు రామకృష్ణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్వామి వారు సూర్యప్రభ వాహనోత్సవంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.