సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.