ప్రకాశం: కంభం మండలంలోని నర్సిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, బోధనా విధానం, విద్యార్థుల హాజరు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు, మౌలిక వసతులు, తాగునీటి సదుపాయం, పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించిన ఎంఈవో సంతృప్తి వ్యక్తం చేశారు.