VSP: కేజీహెచ్‌లో శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. చంద్రశేఖర్ నాయుడు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ సిబ్బంది సేవలు ప్రశంసనీయమని, వారు ఆరోగ్యంగా ఉంటేనే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.