GNTR: బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి సవిత పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా పూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలను మంత్రి సవిత స్మరించారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.