ELR: లింగపాలెం మండలం బాదరాల గ్రామంలో సోమవారం వర్షంతో కూడిన బలమైన ఈదురు గాలులకు పామాయిల్ చెట్టు వ్యవసాయ విద్యుత్ సర్వీస్ వైర్లపై పడింది. దీనితో గ్రామంలో విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయి. విద్యుత్ సిబ్బంది ఇవాళ హుటాహుటిన రంగంలోకి దిగి సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు.