ELR: జిల్లా ఓటర్ల తుది జాబితాను ఏప్రిల్లో ప్రచురించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం ఆమె అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎలక్టర్ మ్యాపింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లాలో సగటున 60.72 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, పెండింగ్లో ఉన్న 1,207 ఫారం- 6, 7, 8 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.