ELR: 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. గురువారం మంత్రుల బృందం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న 20 ఘాట్లకు అదనంగా మరో 16 కొత్త ఘాట్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. పాత వాటిలో రెండింటిని మరింత విశాలంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.