BPT: చీరాల మున్సిపాలిటీ పరిధిలోని పేరాల మసీదు నుండి ఐఎల్టీడీ గేట్ వరకు డ్రెయిన్‌పై రూ.13 లక్షల వ్యయంతో నిర్మించనున్న కవర్ స్లాబ్‌కు మంగళవారం శంకుస్థాపన చేశారు. చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.